మాల్దీవుల నుంచి భారత్‌ బలగాల రెండో బృందం వెనక్కి

-

మాల్దీవుల నుంచి భారత్‌ సైనికులు వెనక్కి వచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా రెండో విడతగా మన బలగాలు వెనక్కి వచ్చాయి. వీరిలో భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాఫ్టర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తెలిపారు.

ఇప్పటికే మాల్దీవుల నుంచి భారత్ బలగాల మొదటి బృందం వెనక్కి వచ్చింది. ఏప్రిల్ 9వ తేదీన రెండో విడతలో మరో సైనికుల బృందం ఉపసంహరించుకుంది. ఇక ఒక బృందం మాత్రమే అక్కడ ఉంది. ఇరు దేశాలు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్లు కూడా మే 10లోపు ఇండియాకు వచ్చేస్తారు. అయితే, రెండో బ్యాచ్‌లో ఎంత మంది భారత సైనికులు వెళ్లిపోయారో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. వారి స్థానంలో శిక్షణ పొందిన భారతీయ పౌరులను నియమించారా? లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొదటి విడతలో భాగంగా అడ్డూ నగరం నుంచి 25 మంది సైనికులు భారత్‌కు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news