విపక్ష కూటమికి ‘BHARAT’ పేరు పెట్టాలి.. అర్థం చెప్పిన శశిథరూర్​

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం ఇండియా పేరును భారత్​గా మార్చడం. ఇండియాను భారత్​గా మార్చాలని కేంద్ర సర్కార్ నిర్ణయించినట్లు గత రెండ్రోజులుగా వార్తా చానెళ్లలో న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులు క్లారిటీ ఇవ్వగా.. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.

అయితే విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం వల్లే మోదీ సర్కార్ ఇండియా పేరు భారత్​గా మారుస్తుందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​కు సంబంధించిన సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి ఓ కీలక సూచన చేశారు. అదేంటంటే..?

‘విపక్షాలు తమ కూటమికి ‘భారత్‌’ అని పేరు పెట్టుకోవాలి. అప్పుడే అధికార పక్షం పేర్లు మార్చే వికృత క్రీడను ఆపేసే అవకాశం ఉంది. అందుకే ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ అని అర్థం వచ్చే పేరు పెట్టుకోవాలి. భారత్‌(BHARAT) అంటే.. అలయన్స్‌ ఫర్‌ బెటర్‌మెంట్‌, హర్మనీ అండ్‌ రెస్పాన్సిబుల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ టుమారో’’ అని శశిథరూర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news