కంగనాపై మోడీ ప్రత్యేక శ్రద్ధ… అలా కడిగేసిన శివసేన!  

-

ప్రస్తుతం జాతీయస్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో.. “బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్” అయ్యిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! మోడీ సర్కార్ పూర్తిగా డబ్బునవారి పక్కనే నిలబడుతుందనే వాదనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! మోడీ సర్కార్ కి సెలబ్రెటీలపై ఉన్న శ్రద్ధ సామాన్యులపై లేకుండాపోయిందనే కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి! ఇదే విషయాలను తాజాగా శివసేన తమ అధికార పత్రిక “సామ్నా”లో పేర్కొంది! మోడీ సర్కార్ కి ముచ్చెమటలు పట్టించింది!

అవును.. పాతమిత్రులు శివసేన.. బీజేపీపై సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా విమర్శణాస్త్రాలు సంధించింది! ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ పేరు చెబుతూ స్వామికార్యం స్వకార్యం పూర్తి చేసింది శివసేన! అవును… కంగనా రనౌత్ కు “వై-ప్లస్” భద్రత కల్పించిన అంశాన్ని తెరపైకి తెచ్చిన శివసేన… “ఒక సినిమా హీరోయిన్‌ కు ఈ స్థాయిలో భద్రత కల్పించిన కేంద్రం.. హత్రాస్‌ దళిత బాధితురాలి కుటుంబానికి ఎందుకు భద్రత కల్పించలేదు” అంటూ దుబ్బయట్టింది!

అక్కడితో ఆగని శివసేన… మోడీ సర్కార్ కు సెలబ్రెటీలపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజానికంపై లేకపోవడం దారుణమని పేర్కొంది. ఇదే క్రమంలో… “హీరోయిన్ కానందువల్లే ఏమో… హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబం ఎలాంటి భద్రతకూ నోచుకోలేకపోయింది.. సమన్యాయ సూత్రం అంటే ఇది కాదు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం చెప్పిన న్యాయం ఇది కానేకాదు” అంటూ మోడీ సర్కార్ ని ఇరకాటంలో పాడేసింది! ప్రస్తుతం ఈ ఆర్టికల్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!! మోడీ – కంగనా ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతుంది.!

-CH Raja

 

Read more RELATED
Recommended to you

Exit mobile version