టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. ముంబైలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాపి రైట్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఆయన తో పాటు గూగుల్ కంపెనీలో మరో ఐదుగురిపై ఈ కేసు నమోదు అయింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతోనే.. తాము కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. కాగ ఈ కాపీ రైట్ ఉల్లంఘన కేసును గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై ఏక్ హసీనా తి ఏక్ దివానా థా అనే హిందీ సినిమా దర్శకుడు సునీల్ దర్శన్ వేశారు.
కాగ తాను ఇటీవల తెరకెక్కించిన ఈ సినిమాను యూట్యూబ్ లో గుర్తు తెలియని వ్యక్తులు అప్ లోడ్ చేశారని డైరెక్టర్ సునీల్ దర్శన్ కోర్టు ను ఆశ్రాయించాడు. అయితే తన సినిమాను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి గూగుల్ పర్మిషన్లు ఇచ్చిందని ఆయన అన్నారు. అందుకే తన సినిమా యూట్యూబ్ లో అప్ లోడ్ అయిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగ ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది.