బీజేపీ అధ్యక్ష పదవీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదని.. రెండు సార్లు బీజేపీ క్రియా శీలక సభ్యత్వం ఉంటే చాలు అని చెప్పారు. రెండు సార్లు బీజేపీ గుర్తు పై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంతేకాదు.. ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం పై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. “పిలిస్తే.. నా మాట కాదనకుండా చిరంజీవి వస్తారు. ఆయనతో నాకు మంచి సంబందాలు ఉన్నాయి. ఇద్దరం ఒకరిని ఒకరం కుటుంబ సభ్యుల్లా భావిస్తాం” అంటూ సమాధానం చెప్పారు.