రాజకీయ నాయకుల పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయ నాయకులందరూ 75 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని.. బాంబు పేల్చారు మోహన్ భగవత్. రాజకీయ నాయకులకు 75 సంవత్సరాలు వచ్చాక… హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కూడా ఇవ్వాలని వెల్లడించారు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. మరో ఏడాది అయితే 75 సంవత్సరాలు పూర్తయితాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి చెప్పినట్లుగా… ప్రధాని నరేంద్ర మోడీ కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. మరి.. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.