మంచి మనసు చాటుకున్న శ్రేయస్ అయ్యర్..వీడియో వైరల్‌

-

టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే..  గాయం నుంచి కోలుకున్న టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన మంచి మనసును చాటుకున్నారు. కారులో వెళ్తున్న సమయంలో ఓ తండ్రి చిన్నారితో సహా శ్రేయస్ వద్దకు వెళ్లి సాయం కోరాడు.

వెంటనే వారిని నవ్వుతూ పలకరించిన శ్రేయస్… తన జేబులోంచి కొంత డబ్బు తీసి వారికి ఇచ్చారు. ఇంతలో మరో వ్యక్తి రాగా… అతనికి కూడా డబ్బు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజున పంత్.. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తన మాటలతో ప్రజల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన పంత్… ఆ తర్వాత బ్యాట్ పెట్టాడు. అలా ఆటలోకి దిగిన రిషబ్ పంత్… సిక్స్ లతో చేరరేగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్… ఫుల్ ఖుషి అవుతున్నారు. పంత్ తిరిగి టీమిండియాలోకి వస్తాడని అందరూ అంటున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news