వరుసగా రెండోసారి సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణం

-

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పల్జోర్​ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్​ లక్ష్మణ్​ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. తమాంగ్​తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. సుమారు 30వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం రాజధాని గ్యాంగ్​టక్​లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇచ్చారు.ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను SKM గెలుచుకుంది. అలా సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 25 ఏళ్ల పాటు సిక్కింను పాలించిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news