అమెరికాలో ట్రంప్ గతే, బీహార్ లో బిజెపికి పడుతుంది…!

బీజార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో కచ్చితంగా అధికార మార్పు అనేది జరుగుతుంది అని సర్వేలు చెప్తున్నాయి. అమెరికాలో ట్రంప్ మాదిరిగా బీహార్ లో బిజెపి ఓడిపోతుంది అని మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన అభిప్రాయపడింది. ఈ ఏడాది ప్రారంభంలో డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించడంపై శివసేన… తన అధికార పత్రిక సామ్నాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 

బీహార్‌ లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) కచ్చితంగా ఓడిపోతుంది అని… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది. అమెరికాలో ఇప్పటికే అధికారం మారిపోయింది… అమెరికాలో ట్రంప్ ఎంత చేసినా డెమొక్రాట్ జో బిడెన్ ఎన్నికల్లో విజయం సాధించారు.. నితీష్ కుమార్ ఎంత చేసినా సరే ఆయన నేతృత్వంలోని ఎన్డియే కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది అని… భారతదేశంలో, మేము ‘నమస్తే ట్రంప్’ అని చెప్పి ఉండవచ్చు, కాని అమెరికన్ ప్రజలు ఆయనకు బై బై చెప్పారు అని వ్యాఖ్యానించింది.