ఇదెక్కడి ఆచారం.. అక్కడ కట్నంగా 9 జాతుల పాములు ఇస్తేనే పెళ్లి

-

పెళ్లి అనగానే ప్రతి ఒక్కరి మెదడులో మెదిలే మొదటి ప్రశ్న కట్నం ఎంత ఇస్తున్నారు అని. సాధారణంగా వివాహ సమయంలో అల్లుడికి కట్నంగా డబ్బు, బంగారం, పొలం, వాహనం ఇవ్వడం కామన్. కానీ అక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది. ఆ ప్రాంతంలో కట్నంగా అల్లుడికి పాములను ఇస్తారట. ఇంతకీ ఇదెక్కడో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా ప్రాంతానికి చెందిన గిరిజన తెగలో పాములను కట్నంగా ఇస్తారట. ఈ ఆచారాన్ని ఆ తెగ వందల ఏళ్లుగా పాటిస్తోంది. పెళ్లిలో సన్వారా తెగలోని వధువు తరఫువారు వరుడికి పాములను కట్నంగా ఇచ్చుకుంటారు. మొత్తం 9 రకాల జాతులకు చెందిన 21 పాములను అల్లుడికి కానుకగా ఇస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోరు.

‘‘మా పూర్వీకులు 60 పాములను ఇచ్చేవారు. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయింది’’ అని సన్వారా తెగ గిరిజనుడు కటంగి తెలిపాడు. ‘‘పాములను ఆడించటం వారి జీవనం. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోంది’’ అని అటవీ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news