ఇక నుంచి మోదీ ఏకపక్ష నిర్ణయాలు సాగవు : సోనియా గాంధీ

-

నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి రాజకీయ, నైతిక ఓటమిగా అభివర్ణించారు. ఈ ఫలితాలతో మోదీ నైతికంగా నాయకత్వ హక్కును కోల్పోయారనీ అన్నారు. అయినా ఓటమికి బాధ్యత వహించక మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారని తెలిపారు.

శనివారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్ని. అనంతరం ఎంపిలను ఉద్దేశించి ప్రసంగింగించిన ఆమె కొత్త NDA ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రత్యేక బాధ్యత తమపై ఉందన్నారు. దశాబ్ధకాలంగా పార్లమెంటును నచ్చినట్లుగా వాడుకున్నారనీ తాజా ఎన్నికల ఫలితాలతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని సోనియా స్పష్టం చేశారు. చర్చలకు అంతరాయం కలిగించేందుకు, విపక్ష సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించడం, ఏకపక్షంగా చట్టాలను తీసుకురావడం, పార్లమెంటరీ కమిటీలను విస్మరించడం వంటివి ఇకపై జరగవని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news