ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం.. దిల్లీలో ఆంక్షలు

-

ప్రధానిగా మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ వేదికకానుంది. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దక్షిణాసియా దేశాధినేతలు తరలిరానున్నారు. అదేవిధంగా 8 వేల మంది వీక్షించనున్నారు.

ఈ నేపథ్యంలో దేశరాజధానిలో పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహానగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అదేవిధంగా దేశ రాజధానిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేశారు. అయితే ఐఏఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఆర్మీ విమానాలకు ఇది వర్తించదని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రపతి భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. సంసద్ మార్గ్, రఫీ మార్గ్, రైసినా రోడ్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, మదర్ థెరిసా క్రెసెంట్, సర్దార్ పటేల్ మార్గ్‌లలో పాస్ ఉన్న వాహనాలు మాత్రమే రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news