నేడు నీది, రేపు మాది…మరచిపోకు ఈ నిజం – వైసీపీ హెచ్చరిక

-

నేడు నీది, రేపు మాది…మరచిపోకు ఈ నిజం అంటూ తెలుగు తమ్ముళ్లకు వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల ఘటనలపై ఆ పార్టీ x వేదికగా స్పందించింది. ‘నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం’ అని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులను ఓ వీడియోగా మలిచి ట్వీట్ చేసింది.

మరోవైపు దాడుల ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను ఇప్పటికే మాజీ సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. కాగా నంద్యాల జిల్లాలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడికి దిగారు. కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్త హరి,భార్య తిరుపతమ్మ పై టీడీపీ వర్గీయులు కట్టెలతో దాడి చేశారు. టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు,ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి….పరిస్థితి విషమం కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news