ఏడు పదుల వయసులో కశ్మీర్​ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర

-

ఏడు పదుల వయసులో పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్​ యాత్ర చేపట్టారు స్పీక్‌ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, 73 ఏళ్ల డాక్టర్​ కిరణ్​ సేథ్​. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో గురువారం రోజున రిషికేశ్‌ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు.

సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని కిరణ్ సేథ్ పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి తన సైకిల్‌యాత్ర దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన 1,000 కి.మీ. ప్రయాణించారు. కిరణ్‌.. ఖరగ్‌పుర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.

ఈ వయసులో 1500 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిరణ్ సేథ్. ఈ యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే సైకిల్​ యాత్రను చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్​ సేథ్​ తెలిపారు. సైకిల్​తో కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version