చంద్రయాన్​-3 కోసం ప్రత్యేక పూజలు.. త్రివర్ణాలతో గంగా హారతి

-

భారత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. మరికొద్ది గంటల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో చంద్రయాన్-3  విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా భగవంతుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.

ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో చంద్రయాన్​-3 ల్యాండింగ్​ విజయవంతంగా జరగాలని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమార్థ్ నికేతన్ ఘాట్‌లో త్రివర్ణ జెండా చేతపట్టుకుని గంగా హారతి ఇచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు.

మరోవైపు.. ఒడిశాలోని పూరిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్​.. చంద్రయాన్​-3కి తన కళతో ఆల్​ ది బెస్ట్ తెలిపారు. పూరి సముద్ర తీరాన సుదర్శన్​ బృందం.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించింది. జయహో ఇస్రో అంటూ ఇసుకతో చెక్కింది. ఈ సైకత శిల్పం.. పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news