తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బియ్యం సేకరణకు నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. గతంలో బియ్యం కొనుగోలు చేసేందుకు అసలు ఆసక్తి చూపని కేంద్ర సర్కార్ ఇప్పుడు మాత్రం… బియ్యం సేకరణకు నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి 50 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ సారి దిగుబడి పెరుగుతుందని 67 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా… 50 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని తెలిపింది. గత ఏడాది 50 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని కేంద్రం చెప్పినప్పటికీ… 44 లక్షల టన్నుల బియ్యం మాత్రం పౌరసరాఫరాల శాఖకు సరాఫరా చేయగలిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో.. కేసీఆర్ సర్కార్ కాస్త ఊరట లభించనుంది.