ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక… ఓ అరుదైన రికార్డును సృష్టించింది. వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు (13*) సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా 21 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ లు 12 గెలుపులతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. అలాగే వరుసగా ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు (13*) ఆల్ అవుట్ చేసిన జట్టుగా శ్రీలంక మొదటి స్థానంలో ఉంది.
కాగా, బంగ్లాదేశ్‌పై శ్రీలంక ‘రికార్డు’ విజయం సాధించింది. ఆసియా కప్ సూపర్-4 దశలో కూడా ‘నాగిని వైరంలో శ్రీలంక పైచేయి సాధించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బాగానే కట్టడి చేశారు.అయితే సదిర సమర విక్రమ్(93) అద్భుతంగా పోరాడాడు. అతనితో పాటు కుషాల్ మెండీస్(50), పాతుమ్ నిస్సంక(40) కీలకమైన ఇన్నింగ్స్ లో ఆడారు. ఇలా శ్రీలంక బ్యాటర్లు రాణించడంతో ఆ టీం నిర్నిత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో బంగ్లాకు ఆశించిన ఆరంభం దక్కలేదు.