ఆసియాకప్ సూపర్-4లో భాగంగానే నేడు కోలంబో వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరిగా సాగనుంది. గత శనివారం వర్షంతో మ్యాచ్ రద్దు కాగా, ఇవాళ కూడా వరుణుడి ముప్పు ఉందని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేపు రిజర్వ్ డే రోజున కూడా వర్షం ముప్పు ఉందని సమాచారం.
టీమిండియా XI: రోహిత్ శర్మ(c), శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ XI: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.