కార్పొరేట్‌ జాబ్‌ చేస్తున్నారా..? ఈ వ్యాధి వస్తుంది జాగ్రత్త

-

స్వీట్స్‌ ఎక్కువగా తింటే షుగర్‌ వస్తుంది, ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే గుండెపోటు వస్తుంది.. ఇలా ఏదో ఒకటి అతిగా తినడం వల్ల ఆయా రోగాలు వస్తాయి. కానీ తిండితో సంబంధం లేకుండా జాబ్ చేయడం వల్ల కూడా ఒక వ్యాధి వస్తుంది తెలుసా..? కేవలం కార్పొరేట్‌ ఉద్యోగులకే ఈ వ్యాధి వస్తుందట. కార్పొరేట్‌ ఉద్యోగులకు బోనస్‌లు సంగతేమో కానీ..ఈ వ్యాధి మాత్రం కచ్చితంగా వస్తుంది అంటున్నారు నిపుణులు.. దానిపేరు ఫైబ్రోమైయాల్జియా సిండ్రోమ్.

ప్రస్తుతం కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనులు చేయడం కారణంగా చాలామంది తీవ్ర ఒత్తిడితో పాటు ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి గురవుతున్నారు. ఇది సాధారణ వ్యాధి అయినప్పటికీ దీనికి కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైబ్రోమైయాల్జియా కారణంగా కండరాలు, కీళ్లు, శరీరంలోని వివిధ భాగాల్లో తీవ్ర నొప్పులు వస్తున్నాయి. దీంతోపాటు చాలామందిలో అలసట, బద్ధకం కూడా వస్తుంది. తరచుగా ఈ సమస్య బారిన పడితే రోజు చేసే పనులు మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫైబ్రోమైయాల్జియా బాధపడే వారు 15 అడుగులు వేయగానే అలసటకు గురవుతారు. అంతేకాకుండా ఏదైనా బరువును ఎత్తే సమయంలో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలోన అయితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫైబ్రోమైయాల్జియా రావడానికి ప్రధాన కారణాలు:

పని ఒత్తిడి:

కార్పొరేట్ ఆఫీసుల్లో పని ఒత్తిడి చాలా సాధారణం. ఉద్యోగాలు చేస్తున్న వారు గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అలసట గురవుతారు. దీనికి కారణంగా కూడా చాలామందిలో ఫైబ్రోమైయాల్జియా వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కార్పొరేట్ ఆఫీసుల్లో పని ఎక్కువగా ఉండడం కారణంగా ఒకే చోట ఒకే ఫోజ్‌లో కూర్చుని ఉంటారు. దీని కారణంగా చాలామందిలో నడుము నొప్పి కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల కారణంగా కూడా ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి దారి తీయొచ్చు.

కార్పొరేట్ ఆఫీసుల్లో ఎన్ని గంటల పాటు పనిచేసిన ప్రాజెక్టులు ముందుకు కదలవు. గంట గంటకు అప్‌డేట్‌ అడిగే బాస్. దీని కారణంగా చాలామంది మానసికంగా బాధపడతారు. ఇది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా కూడా చాలామందిలో ఫైబ్రోమైయాల్జియా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా మందికి అలవాటైపోయింది. కార్పొరేట్ జాబ్‌ అంటే శని ఆదివారం సెలవు. ఇక వారం అంతా ఆ వర్క్‌ ప్రజర్‌, కష్టంతో విసిగిపోయిన దేహానికి ఏదో ఒకటి కొత్తగా కావాలనిపిస్తుంది. వీకెండ్‌ పేరుతో మద్యం తాగడం, బిర్యానీలు, పార్టీలు ఇలా ఎంజాయ్‌ చేస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్‌ అయితే డైలీ తింటారు. ఇలా ప్రతిరోజు బయటి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఫైబ్రోమైయాల్జియా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news