ఓమిక్రాన్ నుంచి కోలుకున్న వారిలో గణనీయంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారత వైద్య పరిశోథన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. తము గత కొద్ది రోజుల నుంచి దేశంలో ఓమిక్రాన్ నుంచి కోలుకున్న పలువురి వ్యక్తులపై అధ్యాయనం చేసినట్టు ఐసీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఈ అధ్యయానంలో తము సంచలన విషయాలను తెలుసుకున్నామని వివరించారు. ఓమిక్రాన్ నుంచి కోలుకున్నవారిలో ఓమిక్రాన్ నే కాకుండా.. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ తో పాటు ఆందోళన బరితంగా ఉన్న మరి కొన్ని వేరియంట్లను కూడా ఎదుర్కొనేంతగా రోగ నిరోధక శక్తి వస్తుందని తెలిపారు.
ముఖ్యంగా అతి ప్రమాకరమైన డెల్టా వేరియంట్ వల్ల వచ్చె ఇన్ ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉంటుందని తెలిపారు. కాగ తాము 88 మంది ఓమిక్రాన్ సోకి.. కోలుకున్న వారిలో ఈ అధ్యాయనం చేసినట్టు తెలిపారు. అందులో ఆరుగురు టీకాలు తీసుకోనివారు కూడా ఉన్నారని తెలిపారు. అయితే టీకాలు తీసుకోని వారిలో కూడా రోగ నిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు. అయితే టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి గణనీయం గా పెరిగిందని తెలిపారు.