ప్రధాని మోదీ ‘డిగ్రీ’ కేసు.. కేజ్రీవాల్‌కు మరోసారి కోర్టు సమన్లు

-

దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ అంశం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయస్థానం దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​కు మరోసారి సమన్లు జారీ చేసింది. మోదీ డిగ్రీ అంశంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం కలిగించారని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు మంగళవారం మళ్లీ స్థానిక కోర్టు సమన్లు పంపింది. ఇరువురు జూన్‌ 7న న్యాయస్థానంలో హాజరుకావాలని అందులో పేర్కొంది.

ఈ  కేసులో మంగళవారం కోర్టుకు రావాలని గతంలో జారీ చేసిన సమన్లు కేజ్రీవాల్‌కు, సంజయ్‌కు అందాయో లేదో అన్న విషయంలో స్పష్టత లేదని.. వర్సిటీ న్యాయవాది తెలపడంతో న్యాయస్థానం ఈ తాజా సమన్లను పంపింది. మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారం అందించాలని ప్రధాన సమాచార కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెడుతూ గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తమ విద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని కేజ్రీవాల్‌, సంజయ్‌ అవమానకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్‌వర్సిటీ ఈ కేసులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news