అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై కేంద్రం సూచించిన నిపుణుల కమిటీని తిరస్కరించిన సుప్రీంకోర్ట్

-

అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై కేంద్రం సూచించిన నిపుణుల కమిటీని తిరస్కరించింది సుప్రీంకోర్టు. నిపుణుల కమిటీ లోని సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన కమిటీ సభ్యులను అంగీకరించమని స్పష్టం చేసింది సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం. అదానీ గ్రూప్ షేర్ల పతనానికి దారితీసిన హిండెన్‌బర్గ్ నివేదికను పరిశీలించి డిపాజిట్ దారులకు నష్టం కలిగించకుండా సూచనలు చేసేందుకు కమిటీ నియమించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

కమిటీలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన నిపుణుల సీల్డ్ కవర్ పేర్లను అంగీకరించబోమని పేర్కొంది సుప్రీంకోర్టు. తామే నిపుణులను ఎంపిక చేసి పూర్తి పారదర్శకతతో కమిటీని నియమిస్తామన్నారు సిజెఐ చంద్రచూడ్. ప్రభుత్వం సూచించిన సభ్యులతో ఏర్పాటు చేసే కమిటీ పై ప్రజల్లో విశ్వాసం ఉండదన్నారు సిజెఐ చంద్రచూడ్. ప్రభుత్వం సూచించిన అభ్యర్ధులతో కమిటీ వేస్తే అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సమానమవుతుందని చెప్పింది సుప్రీం ధర్మాసనం. కమిటీపై పూర్తిగా ప్రజా విశ్వాసం ఉండాలంటే తామే కమిటీని ఏర్పాటు చేస్తామంది సుప్రీం ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version