జ్యోతిక ఫై కంగనా వైరల్ కామెంట్స్.. అంత సీన్ లేదంటూ..

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఆమె తనకు నచ్చని వారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా డైరెక్ట్ గానే ఎటాక్ చేస్తుంది. ఫైర్ బ్రాండ్ లా విరుచుకు పడే కంగనా దాదాపు బాలీవుడ్ లో ఉన్న స్టార్లు అందరినీ ఏదో ఒక సందర్భంలో టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఈమెలో మనిషిని టార్గెట్ చేయడమే కాకుండా ఎదుటి మనిషి టాలెంట్ ని గుర్తించి ఆకాశానికి ఎత్తేసే కోణం కూడా ఉందని తాజాగా జ్యోతిక పై చేసిన కామెంట్స్ తో తెలిసింది..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్ జ్యోతికను ఆకాశానికి ఎత్తేశారు. ఆమెలో ఉన్న టాలెంట్ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు.. ప్రస్తుతం కంగనా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టిన కంగనా తమిళంలో చంద్రముఖికి సీక్వల్ గా రాబోతున్న చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2005 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది కంగనా.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన సాటిలేనిది.. ఆమెకు ధీటుగా నటించడం తనకే కాదు ఇంకెవరికీ సాధ్యం కాదు.. చంద్రముఖిగా జ్యోతిక అద్భుతంగా నటించారు. ఆ స్థాయిలో నటించే అంత సీన్ నాకు లేదు ఈ సినిమాను చూసేవారు కూడా ఈ పాత్రలో నన్ను మాత్రమే చూడాలని జ్యోతిక తో నన్ను కంపేర్ చేస్తే నిరాశ తప్పదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

అలాగే చంద్రముఖి 2 సినిమాలో మొదటగా నటించడానికి జ్యోతికనే అడిగానంట. కానీ ఆమె నిరాకరించడంతో ఆ పాత్రను కంగనాలకు ఇచ్చారు అయితే ఈ సినిమాను సీనియర్ దర్శకుడు పీ వాసు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో రాఘవ లారెన్స్ తో పాటు కంగారు అనౌత్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version