BREAKING: NTA, కేంద్రానికి ఊహించని షాక్ తగిలింది. NTA, కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు(మంగళవారం) విచారణ చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA), కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 0.001 శాతం తప్పులు ఉన్నా NTA చర్యలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.