వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్‌గా తమీమ్ ఇక్బాల్

-

వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్గా తమిమ్ ఇక్బాల్ సెలెక్ట్ అయ్యాడు. భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ కెప్టెన్ గా తమీం ఇక్బాల్ వ్యవహరిస్తారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్మహల్ హసన్ అధికారిక ప్రకటన చేశారు. మరో నెల రోజుల్లో అతను పూర్తి ఫిట్నెస్ లోకి వస్తాడని… ఆ తర్వాత జట్టులోకి చేరతాడని వెల్లడించారు.

తమమ్ ఇక్బాల్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అన్ని విషయాలలో చాలా అండగా ఉంటుందని కూడా తెలిపారు. ఇక ఇటీవల తమిమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రత్యేకంగా అతనికి ఆహ్వానం పంపి… సమావేశమైన తర్వాత… ఇక్బాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇలాంటి తరుణంలోనే అతనికి కెప్టెన్సీ కూడా అప్పగించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. కాగా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటు… అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news