ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే కొంతమంది లీడర్లు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సంతోష్ అనే యువకుడు వినూత్నంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని రాసి ఉన్న ఫ్లెక్సీ ని పట్టుకొని పారాషూట్ తో ఆకాశంలో విహరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టు చేశారు. దీనికి రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్. ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CvCrvDahanI/