నటి కస్తూరి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అన్నమయ్య సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈమె తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలిగా కూడా పేరు సంపాదించింది. ఇటీవలే బీజేపీ సమావేశంలో కస్తూరి ప్రసంగం లో మాట్లాడిన మాటలు పెను దుమారాన్ని సృష్టించాయి. ముఖ్యంగా 400 ఏళ్ల క్రితం రాజులు, మహారాజుల కాలంలో.. తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి.. అంతఃపురంలో మహిళలకు సైతం సేవలు చేసేవారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదంగా మారాయి.
తాజాగా తెలుగు ప్రజల గురించి తానేమి మాట్లాడలేదు అని క్లారిటీ ఇచ్చింది కస్తూరి. మా కుటుంబం కూడా తెలుగు కుటుంబమే. నేను మాట్లాడింది తెలంగాణ, ఏపీ ప్రజల గురించి కాదు.. తెలుగు ప్రజల గురించి నేనేమి మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఫ్రాడ్ గ్యాంగ్ గురించి అన్నారు. డీఎంకే నేతలు తన మాటలను వక్రీకరించి వివాదం సస్టిస్తున్నారని తెలిపారు. తమిళనాడు రాజకీయాల గురించి మాత్రమే కామెంట్స్ చేశానని తెలిపారు. తెలుగు వారంతా కూడా తన కుటుంబ సభ్యులేనని.. తన పైన చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారంటూ తెలియజేసింది నటి కస్తూరి.