టాటా కర్వ్ వచ్చేస్తోంది… ఎలక్ట్రిక్ ఎస్ యూ వీని ఆవిష్కరించిన కంపెనీ

-

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ఎస్ యూ వీగా టాటా నెక్సాన్ ఉండగా… ఇప్పుడు కర్వ్ పేరుతో మరో ఎస్ యూ వీని ఆవిష్కరించింది టాటా. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇప్పటికే టాటా దూసుకుపోతోంది. టాటా నుంచి ఇప్పటికే నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా… భవిష్యత్తులో ఆల్ట్రోజ్ ఈవీ కూడా మార్కెట్ లోకి రానుంది. మరో రెండు రకాల కార్లను కూడా త్వరలోనే మార్కెట్ లోకి తీసుకురావడానికి టాటా ప్రయత్నిస్తుంది. 

తాజాగా టాటా తన ఎలక్ట్రిక్ కారు కర్వ్ ను ఈ రోజు ఆవిష్కరించింది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వనుంది. ప్రస్తుతం టాటాలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదే బెస్ట్ రేంజ్ ఇచ్చే కారుగా ఉంది. దీంతో పాటు ఆధునాతన ఫీచర్లను ఈకార్ లో తీసుకువస్తోంది. ఫ్రేమ్ లెస్ విండోస్, సన్ రూఫ్ టాప్ తో పాటు విశాలమైన క్యాబిన్ ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి. వీటితో పాటు డ్యాష్ బోర్డ్ పై రెండు ఫ్లోటింగ్ స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, మరొకటి ఇన్ఫోటైన్ మెంట్ యూనిట్ గా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news