ఎజిఆర్ బకాయిలను తొలగించడానికి సుప్రీంకోర్టు టెలికాం సంస్థలకు 10 సంవత్సరాల సమయం ఇచ్చింది. మార్చి 21, 2021 నాటికి మొత్తం ఎజిఆర్ బకాయిల్లో 10 శాతం చెల్లించాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును ప్రకటించింది. దీనిపై టెలికాం కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కరోనా సమయంలో దాదాపుగా టెలికాం కంపెనీలు అన్నీ కూడా నష్టపోయిన సంగతి తెలిసిందే. దానికి తోడు జియో దెబ్బ కూడా టెలికాం కంపెనీలపై గట్టిగానే పడింది. వినియోగదారులను కాపాడుకోవడానికి గానూ చాలా వరకు కూడా కష్టాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉచిత కాల్స్ తో పాటుగా కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీనితో నష్టాల్లో ఉన్నాయి టెలికాం కంపెనీలు.