Tella Panchami on Nagula Panchami in Karnataka: కర్ణాటకలో వింత ఆచారం నెలకొంది.. నాగుల పంచమి రోజున తేళ్ల పంచమి జరుపుకుంటున్నారు జనాలు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ నాగుల పంచమి అన్న సంగతి తెలిసిందే. ఈ నాగుల పంచమి రోజు సందర్భంగా చాలా మంది భక్తులు… పాములకు పాలు పోస్తారు. పాము పుట్టల వద్దకు వెళ్లి పాలు పోస్తారు.
అయితే… కర్ణాటకలోని కందుకూరులో వింత ఆచారం తెరపైకి వచ్చింది. నాగుల పంచమి రోజున తేళ్ల పంచమి జరుపుకుంటున్నారు. తేలు కు గుడి కట్టి మొక్కుతున్నారు కర్ణాటక వాసులు. నారాయణ పేట జిల్లా సరిహద్దుల్లో తేళ్ల పంచమి సందడి నెలకొంది. ఘనంగా ఈ ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఏ తేలును ముట్టుకున్న కరవదని వారి నమ్మకమని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.