తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లు

-

తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ ప్రకటించింది. నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ అనే సంస్థతో కలిసి 225 మంది (మొత్తం 233 మంది సభ్యులు) రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదికను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ  సహా రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్‌ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో 18 మంది ఎంపీలు ఉండగా.. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.9,419 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌ – 5 ( మొత్తం 11 మంది ఎంపీలు), తెలంగాణ – 3 (మొత్తం ఏడుగురు ఎంపీలు), మహారాష్ట్ర – 3 (19 మందిలో), దిల్లీ – 1 (ముగ్గురు ఎంపీలు), పంజాబ్‌ – 2 (ఏడుగురు ఎంపీలు), హరియాణా – 1 (ఐదుగురు ఎంపీలు), మధ్యప్రదేశ్‌ – 2 (మొత్తం 11 మంది) ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ.100 కోట్లుగా ప్రకటించినట్లు తెలిపింది.

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news