ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

-

దేశంలో కరోనా కొత్త వేరియంట్ BF – 7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైద్య ఆక్సిజన్ నిలువలపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విదేశాలలో కోవిడ్ విజృంభన దృశ్య ఈ నిర్ణయం తీసుకుంది. తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఆక్సిజన్ సరఫరా లో జాగ్రత్తలు సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.

ఇక విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో రెండు శాతం ప్రయాణికులకు విమానాశ్రయాలలోనే కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ పరీక్షలు తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా తెలిపారు. ఈ దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్న లేదా పాజిటివ్ వచ్చిన క్వారంటైన్ కి తరలించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news