ప్రయాణికులకు షాక్..650కి పైగా రైళ్లను రద్దు చేసిన కేంద్రం

-

ప్రయాణికులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. దేశంలో బొగ్గు సంక్షోభం నానాటికీ తీవ్రం అవుతోంది. ఈ నేపథ్యంలో కరెంట్‌ కోతలు పెరిగాయి. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగకుండా.. ఉండేందుకు ప్రయాణికుల రైళ్లను రద్ద చేస్తోంది.

బొగ్గు రవాణాను పెంచేందుకు నేడు 42 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దుచేసినట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటన చేశారు. తదుపతి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు. మరోవైపు వచ్చే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్‌ రైళ్ల ను రద్దు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకు 650 పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లతో పాటు మెయిల్‌, కమ్యూటర్‌ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news