డ్రగ్స్ వాడకం పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక నిర్ణయం ఒక రకంగా డ్రగ్స్ వినియోగదారులకు శుభవార్త అని చెప్పాలి. అయితే ఎన్ డీ పీ ఎస్ చట్ట సవరణకు కేంద్రం ప్రభుత్వం అడుగులు వెస్తుంది. ఈ చట్ల సవరణ వల్ల మొదటి సారి డ్రగ్స్ వాడిన వారికి కాస్త ఉప శమనం లభిస్తుంది అని చెప్పాలి. ఈ చట్ట సవరణ వల్ల తొలిసారి డ్రగ్స్ తీసుకున్న వారికి శిక్షనుంచి మినహాయింపు ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.
అందుకు అనుగూణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని కోసం ప్రత్యేకంగా ఒక బిల్లు ను కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. డ్రగ్స్ వినియోగదారుల కు అమ్మకం దార్ల కు ఒకే రకమైన శిక్ష విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.
అలాగే తొలిసారి డ్రగ్స్ తీసుకున్న వారిని జరిమానాతో వదిలివేయాలని కేంద్రం అనుకుంటుంది. కేవలం డ్రగ్స్ కు బానిసలైన వారికి మాత్రమే జైలుశిక్ష లేదా జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాని కోసమే ప్రత్యేకంగా ఇప్పుడున్న చట్టంలో మార్పలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకు అనుకూలంగా అడుగులు కూడా వేస్తుంది.