మీకు రేషన్ కార్డు వుందా..? అయితే మీకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ప్రత్యేక సేవలు అందిస్తోంది. రేషన్ కార్డు కలిగిన వారికి కొత్త యాప్ ని ఒకటి తీసుకు రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
కొత్త యాప్ ని రేషన్ కార్డు వున్న వాళ్ళ కోసం కేంద్రం తీసుకు వచ్చింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి పలు రకాల బెనిఫిట్స్ కలుగనున్నాయి. ఆ యాప్ ఏమిటంటే మేరా రేషన్. అసలు ఈ యాప్ ఎందుకు, ఎలాంటి లాభాలని రేషన్ కార్డు కలిగినవాళ్లు పొందొచ్చు అనేది చూస్తే.. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది చాలా అనువుగా ఉంటుంది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి ఇది హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారు రేషన్ షాపు దగ్గరిలో ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకోవచ్చు. ఇంకా ఇటీవల తీసుకున్న సరుకులు వివరాలు కూడా మీరు చూడొచ్చు. అదే విధంగా లావాదేవీల సమాచారం కూడా ఈ యాప్ లో ఉంటుంది.
ఇది ఇలా ఉంటే హిందీ, ఇంగ్లీష్‌లోనే ఈ యాప్ అందుబాటులో వుంది. అయితే రానున్న కాలం లో తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఇది అందుబాటు లోకి వస్తుంది. ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకో వచ్చు. మీరు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే మీ యొక్క రేషన్ కార్డు సహాయం తో రిజిస్టర్ చేసుకోచ్చు.