బ్రేకింగ్: మరో 40 రైళ్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనేక ప్రత్యేక రైళ్లలో భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సెప్టెంబర్ 21 నుండి 20 జతల (40 రైళ్లు) క్లోన్ స్పెషల్ రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇవి అన్నీ కూడా రిజర్వేషన్ రైలు అని కేంద్రం పేర్కొంది. కేవలం ప్రత్యేకమైన సమయంలో మాత్రమే అవి నడుస్తాయని కేంద్రం వెల్లడించింది. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

రైల్వే బోర్డు చైర్మన్ వికె యాదవ్, సెప్టెంబర్ 5 న వర్చువల్ విలేకరుల సమావేశంలో, క్లోన్ రైళ్లను అధిక ఆక్యుపెన్సీ ఉన్న మార్గాల్లో నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ క్లోన్ స్పెషల్ రైళ్లు ప్రస్తుతం పనిచేస్తున్న 310 రైళ్లకు అదనంగా నడుస్తాయి అని కేంద్రం పేర్కొంది. మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే ప్యాసింజర్, మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేసింది.