ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి: అలహాబాద్ హైకోర్టు

తాజాగా అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని సూచించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మాత్రమే కాకుండా గో సంరక్షణ హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని చెప్పింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి ఒక చట్టం చేయండి… ఆ విధంగా ఆవులు మానవ జీవితాలు రెండు సురక్షితంగా ఉంటాయి అని అన్నారు.

పైగా ఇది దేశానికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది అని అన్నారు. వేదాల నుండి కూడా ఆవుల గురించి ప్రస్తావన జరుగుతోంది. పురాతన కాలం నుండి ఆవులకి ఎంతో ప్రాముఖ్యత వుంది. భారతీయ సంస్కృతిలో ఆవు ఎంతో ముఖ్యమైనది. దేశంలో ఆవులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం కూడా సంతోషంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

గోమతి లో నిందితుడైన జావేద్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. గో వధ చట్టాన్ని ఉల్లంఘించిన జావేద్ కి బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఇలా తప్పు చేయడం అతనికి మొట్టమొదటి సరి కాదు అని గతం లో కూడా ఇలాంటి తప్పులు చేసాడు అని అన్నారు. ఆవులను మతపరమైన కోణం నుంచి చూడకూడదని ఆవులను గౌరవించాలని రక్షించాలని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మౌలానా అర్షద్ మదానీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.