విచారణకు హాజరైన ఛార్మి… ఈడీ ప్రశ్నల వర్షం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో డ్రగ్స్ కేస్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా… టాలీవుడ్ నటి చార్మి ఈడి అధికారుల ముందు హాజరైంది. ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన నటి ఛార్మి. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో పలు కీలక అంశాలపై ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ మరియు ఛార్మి మధ్య వాట్సాప్ చాటింగ్ పై ఆరాతీస్తున్నారు వీడియో అధికారులు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నే నటి చార్మీని ప్రశ్నిస్తున్నారు ఈడి అధికారులు. అలాగే ఛార్మి కి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను కూడా సమూలంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈడీ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆగస్టు 31న టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ ఛార్మీని విచారిస్తోంది ఈడీ.