హామీల అమలుకే తొలి ప్రాధాన్యత : ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్త

-

ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేఖా గుప్త కీలక వ్యాఖ్యలు చేశారు. తన పట్ల పూర్తి నమ్మకం ఉంచిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ప్రజల నుంచి తీసుకున్న ప్రతీ రూపాయికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇవాళ మధ్యాహ్నం 12.35 గంటలకు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో 9వ సీఎం గా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ కూటమి సీఎంలు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news