ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ మిడతల హడావుడి మొదలయింది. అక్కడ కాస్త అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుని ఇక రావులే అని భావించిన మిడతలు మళ్ళీ కూడా తమ ప్రతాపం చూపించాయి. రాజస్థాన్ నుంచి మిడతలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాయి. కరోనా దెబ్బకు అల్లాడుతున్న ఆ రాష్ట్రంలో ఇప్పుడు మిడతల హడావుడి ఎక్కువగా ఉంది.
తాజాగా మిడతలు ఆ రాష్ట్రంలోకి ప్రవేశించి అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మిడుత సమూహాలు బహ్రాయిచ్ మీద దాడి చేసాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇక అక్కడి ప్రభుత్వం కూడా మిడతల దాడిపై అప్రమత్తంగానే ఉంది. ప్రస్తుతం మిడతలపై డ్రోన్లతో దాడి చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించింది.