బెంగాల్ లో జూనియర్ డాక్టర్ ఘటన.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది : రాహుల్ గాంధీ

-

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో వైద్య విద్యార్థిని పై లైంగికదాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో జూనియర్ డాక్టర్లు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ తరుణంలో గత కొద్ది రోజుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

“కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె పై క్రూరమైన, అమానుషమైన చర్యకు సంబంధించిన దారుణంతో వైద్యులు, మహిళల్లో అభద్రతా వాతావరణం నెలకొంది. బాధితురాలికి న్యాయం చేయకుండా.. నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం సదరు ఆసుపత్రి, స్తానిక ప్రభుత్వ పాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని.. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకే భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను బయటికి పంపిస్తే.. ఎలా అని ఆలోచించేలా ఈ ఘటన చేసిందని.. నిర్భయ కేసు తరువాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి.. దోషులకు తగిన శిక్ష విధించి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చూసుకోవాలని  ట్వీట్ లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ.

 

Read more RELATED
Recommended to you

Latest news