జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం

-

జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం జరుగనుంది. ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్స్‌పై తన వైఖరి ఖరారు చేయనుంది లా కమిషన్.

జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా భారీగా ఆదా చేయవచ్చని భావిస్తున్న లా కమిషన్..అలాగే తరచుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని భావిస్తోంది.

అలాగే పోక్సో చట్టం కింద పిల్లల కనీస వయస్సును సైతం నిర్థారించనున్న లా కమిషన్.. లైంగిక నేరాల విషయంలో మైనర్లుగా నిర్థారించే వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది. ఆన్‌లైన్ ద్వారా ఎఫ్.ఐ.ఆర్ నమోదు అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న లా కమిషన్..ఈ అన్ని అంశాలపై లోతుగా, సుదీర్ఘంగా చర్చించి తన సిఫార్సులతో కూడిన 22వ నివేదికను కేంద్రానికి అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news