భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు వరల్డ్ కప్ కోసం ప్రత్యేక సాంగ్‌ను రూపొందించింది ఐసీసీ. దిల్ జషన్ బోలే అంటూ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, టీమ్ ఇండియా స్పిన్నర్ చహాల్ భార్య ధనశ్రీ వర్మ ఆడి పాడారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం రూపొందించారు ఈ సాంగ్.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో వరల్డ్ కప్ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియా తో ఇండియా తొలి మ్యాచ్ జరుగనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. కాగా..హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వన్డే ప్రపంచకప్ పోటీలకు సిద్ధమవుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఈ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడనున్నాయి. దాంతో ఇప్పటికే అభిమానులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వాళ్ళందరికీ బీసీసీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్ కు ఎవరిని అనుమతించడం లేదని స్పష్టం చేసింది.