అసెంబ్లీ అంటే బాలకృష్ణకు షూటింగ్ లాగా కనిపిస్తోందా?? అని ఏపీ మంత్రి రోజా సీరియస్ అయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బాలయ్య తొడ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య తొడ కొట్టిన విషయంపై ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ జరిగిన ఘటనలు దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు అరెస్టు పై చర్చకు అడుగుతున్న టీడీపీ వాస్తవంగా చర్చ జరగాలని కోరుకోవటం లేదని ఆగ్రహించారు.
అందుకే సరైన ఫార్మెట్ లో రమ్మని చెబుతున్నా కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. అసెంబ్లీ అంటే బాలకృష్ణ కు షూటింగ్ లాగా కనిపిస్తోందా?? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి రోజా. వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే మా సభ్యులు తొడలు కొట్టారన్నారు. టీడీపీ బీఏసీ కి వచ్చి ఏ అంశాలు చర్చకు కోరుతున్నారో అడగాలని మండిపడ్డారు ఏపీ మంత్రి రోజా. అటు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తనకు మీసం చూపి తొడగొట్టారని టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. తల్లి లాంటి తన వృత్తిని మంత్రి అంబటి అవ మానిస్తే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని వివరించారు బాలయ్య. ఏపీ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.