40 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోస్ లు రెడీ

-

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 40 మిలియన్ మోతాదుల డోస్ లను తయారు చేసిందని… త్వరలోనే నోవావాక్స్ కూడా తయారి మొదలవుతుంది అని ఇద్దరూ రెగ్యులేటరీ అనుమతి పొందాలని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లు ఇంకా ఆమోదించబడలేదని సీరం పేర్కొంది.

అవి సురక్షితమైనవి అలాగే సమర్థవంతమైనవి అని నిరూపించడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తయారీదారుల డెలివరీలను వేగవంతం చేయడానికి ఉత్పత్తిని ప్రారంభించడానికి నిధులు సమకూర్చారని సీరం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పుడు ఇండియాకి వస్తుందా లేక ప్రపంచం మొత్తానికి అందిస్తారా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత సీరం ఇవ్వలేదు. ఆస్ట్రాజెనెకా చివరి దశ ట్రయల్స్ కోసం భారతదేశంలో 1,600 మంది వాలంటీర్ లను చేర్చుకున్నట్లు సీరం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news