దీపావళి క్రమంలో వేళ కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఆత్మ నిర్భర 3.0 కింద కేంద్రం ఉద్దీపనలు చేపట్టనుంది. ఆత్మ నిర్భర్ రోజ్గార్ యోజన ఈరోజు కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద ఉద్యోగాల కల్పన కేంద్రం సృష్టించనుంది. ఈపీఎఫ్ ఓ రిజిస్ట్రేషన్ కంపెనీల ద్వారా ఉద్యోగాల ప్రక్రియను చేపట్టనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
లాక్ డౌన్ వలన ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి లభించనుందని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. కొవిడ్ తగ్దుతుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపారు. అక్టోబర్ లక్షా 5 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు తెలిపారు నిర్మలా. మార్కెట్లు కూడా కోలుకుంటున్నట్లు ప్రకటించారు.