విపక్షాల కూటమి ‘ఇండియా’ మూడో విడత సమావేశం నేటి నుంచి ముంబైలో జరగనుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ తో పాటు 27 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. ఉమ్మడిగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ బేటిలో రూపొందించనున్నారు.
ఈ కూటమి చైర్ పర్సన్ గా మల్లికార్జున ఖర్గే, కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం రాహుల్ గాంధీని కూటమి పీఎం అభ్యర్థిగా అందరూ అనుకునుటున్నారు. కానీ సరికొత్తగా ఆప్ నేతలు ఏమో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను, మరియు TMC నేతలు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని పీఎం అభ్యర్థులుగా ప్రకటించాలని కోరుకుంటున్నారు.