ఐదునిమిషాల్లో పెళ్లి ముహుర్తం… అదిరిపోయే షాక్ ఇచ్చిన వధువు.!

పెళ్లికి బంధువులంతా వచ్చారు. హుడావిడి మొదలైంది. రిసెప్షన్ లో వధూవరులతో స్నేహితులు ఫొటోలు దిగుతున్నారు. మరో 5నిమిషాల్లో ముహూర్తం. ఇంతలో పోలీసులు ఎంట్రీ..పెద్దల కుదిర్చిన పెళ్లిల్లో ఇలాంటివి ఉండకూడదే.. కానీ ఆ కుటుంబసభ్యులు పెళ్లికుమారుడికి ఇష్టానికి ఇచ్చిన గౌరవాన్ని కన్న కూతురి ప్రేమకు ఇవ్వలేదు. బలవంతంగా పీఠలెక్కిద్దామనుకున్నారు..కానీ పెళ్లికూతురు ఇచ్చిన ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. పీఠలమీద పెళ్లి ఆగిపోయింది.

wedding
wedding

వధువు తమిళనాడులోని సాఫ్ట్ వేర్ కంపెనీలు పనిచేస్తోంది..అదే కంపెనీలు పనిచేస్తున్న ఓ తమిళ యువకుడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. యువతి తల్లిదండ్రులు వేరే పెళ్లి ఫిక్స్ చేశారు. ఇష్టం లేదన్నా వినకుండా బలవంతంగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. రిసెప్షన్ వైభవంగా జరుగుతుంది.. నూతన వధూవరులను బంధుమిత్రులంతా ఆశీర్వదిస్తున్నారు.

తన ప్రియురాలికి ఇష్టంలేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ప్రియుడు అటు తమిళనాడు పోలీసులకు ఇక్కడ కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు..రంగంలోకి దిగిన పోలీసులు కల్యాణ మండపానికి హుటాహుటిన చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. వధువుని అడిగితై తను ధైర్యంగా పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. పాపం.. ఆ పెళ్లికుమారుడు పీఠలమీద నుంచి ఆగ్రహంతో లేచి వెళ్లిపోయాడు. అంతే వరుడి పరివారమంతా ఇంటిదారిపట్టారు.

పోలీసులు సమక్షంలో మండల తహసీల్దార్ కు యువతి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆపై ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతలో హీరో తన స్నేహితులతో ఎంట్రీ ఇచ్చాడు. పోలీసులు అందరిని కడపకు తరలించారు. రీల్ కథను మరిపించే ఈ రియల్ స్టోరీ ఇప్పుడు నేటి తరం యువతకు ఓ పక్క ఊరటగా తల్లిదండ్రులకు ఆగ్రహంగా నిలిచింది. పెద్దలు కుదిర్చే పెళ్లిల్లలో అటు ఇటు ఏడుతరాలతను చూడటం కంటే ముందు పిల్లల మనసులో ఏముందో తెలుసుకుంటే ఇలాంటి పరిణామాలు జరగవని పలువురు అంటున్నారు. ఇప్పుడు ఆ వధువు తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.