చ‌రిత్ర ను తిర‌గ‌రాసిన మ‌హిళా లోకం.. పెరిగిన మ‌హిళా జ‌నాభ‌

-

దేశ చ‌రిత్ర లో మ‌హిళలు కొత్త రికార్డు నెల‌కొల్పరు. దేశంలో ప్ర‌తి 1000 ప‌రుషుల కు 1020 మంది మ‌హిళ లు ఉన్న‌ట్టు నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే ప్ర‌క‌టించింది. పురుషులు మ‌హిళల నిష్ప‌త్తి లో దేశ చ‌రిత్ర లో ఈ విధంగా ఎప్పుడూ రాలేద‌ని తెలిపారు. మొద‌టి సారి పురుషుల కంటే మ‌హిళల జ‌నాభ ఎక్కువ ఉంద‌ని నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే తెలిపింది.

కాగ 1990 లో ప్ర‌తి 1000 మంది పురుషుల‌కు మ‌హిళ ల సంఖ్య కేవ‌లం 927 మాత్ర‌మే ఉండేది. ఆ సంఖ్య కాస్త 2016 కు వ‌చ్చే స‌రికి ప్ర‌తి 1000 మంది పురుషుల‌కు 991 మంది మ‌హిళ‌లు ఉండే వారు. తాజాగా పురుషుల సంఖ్య నే దాటిసింది. కాగ ప్ర‌స్తుత కాలం లో కుటుంబాల‌లో మ‌హిళ ల‌కు స‌ముచిత స్థానం ఇస్తున్నారు. అలాగే మహిళ లు కూడా పురుషుల కంటే త‌క్కువ కాద‌ని నిరూపిస్తూ ప‌లు రంగాల‌లో దూసుకుపోతున్నారు. దీంతో మ‌హిళల జ‌నాభ గ‌ణ‌నీయం గా పెరుగుతంది.

Read more RELATED
Recommended to you

Latest news