వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ లోకని ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్, తమిళనాడు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం, ఆర్జేడీ, జేఎంఎం, ఆప్ వంటి పార్టీలు వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మతపరమైన వక్ఫ్ బోర్డు ఆస్తులలో అవినీతి, దుర్వినియోగాన్ని వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది.
చాలా రోజుల నుంచి వక్ఫ్ బోర్డుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. సరైన ప్రక్రియ లేకుంటే ఏ భూమిని అయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాయి. వక్ప్ సవరణ బిల్లు 2025 దేశ పౌరులకు లాభాలు చేకూరుతాయి. జవాబు దారి తనం ద్వారా పాలనను మెరుగు పరచడం.., భూమికి రక్షణ, వక్ఫ్ బోర్డు లో మహిళలను చేర్చడంతో వారి స్త్రీ ప్రాతినిధ్యం, లింగ సమానత్వం పెరుగుతుంది.టెక్నాలజీతో వక్ఫ్ ఆస్తులను ఆడిట్ లో సులభతరం చేస్తుంది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన రికార్డుల డిజిటలైజేషన్ చేస్తోంది. ఇది న్యాయం కోసం, పారదర్శకత కోసం చేసిన సంస్కరణ అని ప్రభుత్వం చెబుతోంది.